జర్నలిస్ట్ ల పై దాడులు చేస్తే సహించేది లేదు
తీగల శ్రీనివాస్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్
మంచిర్యాల,ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్): సీనియర్ జర్నలిస్ట్ శంకర్ పై హైదరాబాద్ ఎల్బీనగర్ లో గురువారం అర్ధరాత్రి కొందరు దుండగులు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడాన్ని అల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు తీవ్రంగా ఖండించారు.శనివారం ఆయన మంచిర్యాలలో ఒక ప్రకటన విడుదల చేసారు. నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పే జర్నలిస్ట్ ల పై ఇలా భౌతిక దాడులు చేయటం చాలా దారుణం అని అన్నారు. ఏన్ని ప్రభుత్వాలు మారిన జర్నలిస్ట్ ల పై దాడులు ఎదో ఒక్క చోట జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రశ్నించే జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టడంతో పాటు, భౌతిక దాడులు కూడా జరిగాయి అని అన్నారు.ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జర్నలిస్టులకు రక్షణ ఉంటుందనుకుంటే భౌతిక దాడులు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన జర్నలిస్ట్ శంకర్ పైన దాడి చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని తీగల శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు.