పారిశుధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
సుల్తానాబాద్,ఫిబ్రవరి20(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్ మంగళవారం ఉదయం పారిశుధ్య పనులను పరిశీలించి మెయిన్ రోడ్ ల వెంట చెత్తను ప్లాస్టిక్ వ్యర్ధాలను పారవేయకుండా తగు చర్యలు తీసుకోవాలని,చెత్తను రోడ్ల పై పారవేసేవారికి జరిమానాలు విధిస్తామని, మెయిన్ రోడ్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ పారిశుధ్య సిబ్బందికి తగు సూచనలు చేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు శానిటరీ సూపర్ వైజర్ శ్రావణ్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.