సంగీత గాయకుడిగా రాణిస్తున్న సుల్తానాపూర్ విద్యార్థి.
మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా జ్ఞాపిక అందజేత.
కరీంనగర్,ఫిబ్రవరి19(కలం శ్రీ న్యూస్):చిన్న వయసులోనే సంగీత గాయకుడిగా వివిధ ప్రదేశాలలో తన గానంతో ప్రజలను అబ్బురపరుస్తున్న సుల్తానాపూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి అభిరామ్ ఆదివారం కరీంనగర్ లో జరుగుతున్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న అభిరామ్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా మెమొంటో , సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే తన సంగీత గానంతో ప్రతిభా చూపుతున్న అభిరామ్ కు మంచి భవిష్యత్తు ఉందని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అక్కినపల్లి నాగరాజు తో పాటు పలువురు పాల్గొన్నారు .