Wednesday, September 18, 2024
Homeతెలంగాణప్రభుత్వ విప్ కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

ప్రభుత్వ విప్ కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

ప్రభుత్వ విప్ కారు బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

జగిత్యాల,ఫిబ్రవరి19(కలం శ్రీ న్యూస్): సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బయటపడగా ప్రాణాపాయం తప్పింది. ఆదివారం హైదరాబాద్ వెళ్లిన విప్ తిరిగి వస్తూ జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట, కొత్తపేట మధ్యలో ఉన్న టర్నింగ్ వద్ద వరంగల్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి వస్తున్న విప్ కారు డ్రైవర్ వెల్గటూర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోగా అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో పడింది. ఘటన సమయంలో కారులోనే ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఇద్దరు గన్‌మెన్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక ఎస్సై ఉమా సాగర్ ఘటనా స్థలానికి వెళ్ళి విప్‌తో పాటు మిగిలిన వారిని హుటాహుటీన కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం లేదని స్వల్ప గాయాలు తగిలాయని డాక్టర్లు వెల్లడించడంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరింత మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!