మేడారం జాతర స్పెషల్ బస్సులను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజ్జన్న
పెద్దపల్లి,ఫిబ్రవరి18(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ గ్రౌండ్స్ లో మేడారం జాతరకు వెళ్ళే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణ రావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ..ఈ సంవత్సరం మేడారం జాతరకు వెళ్ళే భక్తుల రవాణా అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర సర్కార్ మన పెద్దపల్లి నుండి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతుందనీ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మేడారం జాతరకు కూడా వర్తిస్తుందని, అలాగే మా ఆడపడుచులందరూ ఉచితంగా మేడారం జాతరకు వెళ్లి ఆ సమ్మక్క సారలమ్మ దీవెనలను స్వీకరించాలని, దీనికి అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని విశాలవంతమైన పెద్దపల్లి ఐటిఐ గ్రౌండ్స్ లో అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బాధ్యత వహించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిదులు, మేడారం జాతర భక్తులు, తదితరులు పాల్గొన్నారు.