Saturday, July 27, 2024
Homeతెలంగాణమేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లు

మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లు

మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లు

వరంగల్, ఫిబ్రవరి 18(కలం శ్రీ న్యూస్):తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్ల ను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ. కిషన్‌ రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడుస్తాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్-వరంగల్, నిజామాబాద్-వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ మార్గంలో నడుస్తాయని తెలిపారు. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భువనగిరి, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరు ప్రాంతాలకు చెందిన వారికి ఉపయోగపడనున్నాయి.

సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్ (07017/07018), సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్ మధ్య (07014/07015) నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (7019/07020) రైళ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రభుత్వం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే జాతరకు ప్రత్యేక రైళ్లు వేయడంతోపాటుగా జాతర ఏర్పాట్ల కోసం రూ.3కోట్లను కేటాయించిందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!