మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం
మంథని,ఫిబ్రవరి16(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్‌పై 9 మంది కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై ఈనెల 1వ తేదీన పెద్దపల్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా,కలెక్టర్ ఆదేశాల మేరకు మంథని ఆర్డీవో, ప్రోసిడింగ్ అధికారి హనుమా నాయక్ అధ్యక్షతన అవిశ్వాసంపై శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు.