గడపగడపకు శ్రీరాముడి అక్షింతలు
మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు…
సుల్తానాబాద్,జనవరి07(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి అయోధ్య రాముల వారి అక్షింతలతో పాత జెండా, శివాలయం,పోలీస్ స్టేషన్ మీదుగా ఇంటింటికి అక్షింతల పంపిణీ కార్యక్రమం జరిగింది. పూజారి సౌమిత్రి శ్రావణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ బిరుదు సమతా కృష్ణ హాజరయ్యారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు వోల్లాల అంజయ్య, కొమురవెల్లి రవీందర్, కొమురవెల్లి హరీష్, వోల్లాల రాజు లు ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేశారు. శివాలయం లో పూజారులు వల్లకొండ మహేష్, రమేష్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, వాసవి మాత దేవాలయం చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, భక్తులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఈ ఊరేగింపులో మహిళలు, భక్తులు శ్రీరామ జయరామ అంటూ పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.