మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు
నిజామాబాద్,డిసెంబర్ 24(కలం శ్రీ న్యూస్):పెళ్ళికొడుకు బంధువులకు మూలుగ బొక్క వేయలేదని వివాహం రద్దు చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించడానికి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.దీంతో కట్న కానుకలు అన్ని మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం సందర్భంగా యువతి ఇంట్లో మాంసాహారంతో భోజనం ఏర్పాటు చేశారు.అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో,మూలుగ బొక్కలు లేవు అనడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వైపు ల బంధువుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.చివరలో పెళ్లి రద్దు చేసు కోవడంతో బలగం సినిమా గుర్తుకు వచ్చింది. అత్త గా. అయినా వీళ్ళ చాదస్తం కాకపోతే మూలుగ బొక్క కోసం పెళ్లిరద్దు చేసు కోవడం ఏంటి?