మంత్రి శ్రీధర్ బాబు ను కలిసిన మంథని మున్సిపల్ నూతన కమిషనర్.
మంథని,డిసెంబర్18(కలం శ్రీ న్యూస్): రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ ని కలిసిన మంథని మున్సిపల్ నూతన కమిషనర్.పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ నూతన కమిషనర్ గా నియమితులైన జి.మల్లికార్జున స్వామి సోమవారం ఉదయం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని మర్యాద పూర్వకంగా మంథని నివాసంలో కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మంత్రి నూతన కమిషనర్ కి పలు సూచనలు చేస్తూ మంథని మున్సిపాలిటీని నిర్భయంగా, అవినీతి రహితంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని,ఎవరి బెదిరింపులకు లొంగకుండా పని చేయాలని, అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో పట్టణాన్ని తీర్చిదిద్దుతామని మంత్రివర్యులు తెలిపారు.