Saturday, July 27, 2024
Homeతెలంగాణబిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ రైతు బిడ్డదే

బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ రైతు బిడ్డదే

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్

హైదరాబాద్,డిసెంబర్17(కలం శ్రీ న్యూస్):

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఆ తరుణం రానే వచ్చేసింది. బిగ్ బాస్ 7 విజేత ఎవరో మరికొద్ది సేపట్లో తెలిసిపోనుంది.బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్ బాస్ సీజన్ 7టైటిల్ కోసం అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్  ప్రియాంక పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్ కి చేరిన 6 గురిలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ దక్కింది.. అయితే చివరి వరకు శివాజీ,అమర్ గట్టి పోటీ ఇవ్వగా విజేతగా మాత్రం పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీనితో బిగ్ బాస్ లో తొలిసారి ఈ ఘనత సాధించిన సామాన్యుడిగా ప్రశాంత్ రికార్డ్ సృష్టించారు.

పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో అతడికి 35 లక్షల నగదుతో పాటు మారుతి కారు, 15 లక్షల విలువైన బంగారం దక్కింది. పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లో వున్న వారందరితో ఎన్ని ఇబ్బందులు తలెత్తిన కూడ ప్రశాంత్ ఎప్పుడూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. ముఖ్యంగా అమర్ దీప్ తో హౌస్ లో ప్రశాంత్ కి సమస్యలు వస్తున్నప్పటికీ ప్రశాంత్ వీలైన మేరకు ఎంతో కూల్ గా డీల్ చేస్తూ ఎంతో చక్కగా తన గేమ్ ను ఆడాడు. ప్రతి టాస్క్ ను ఎంతో చక్కగా పూర్తి చేసాడు.దీనితో క్రమంగా ప్రశాంత్ గురించి ఆడియన్స్ చర్చించుకుంటూ వచ్చారు.అలాగే హౌస్ శివాజీ సపోర్ట్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక లతో జరిగిన గొడవలు పల్లవి ప్రశాంత్ కి పాజిటివ్స్ గా మారాయి. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ పల్లవి ప్రశాంత్ కు బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్ లో మాట్లాడుతూ వచ్చాడు. దీనితో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ వచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ గెలుచుకున్నాడు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!