భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్
సిద్దిపేట,డిసెంబర్15(కలం శ్రీ న్యూస్): సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆకుల నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చైతన్య, ఇద్దరు పిల్లలు రేవంత్, హిమశ్రీని చంపేసి గన్ తో కాల్చుకున్నాడు. ఈ రోజు ఉదయం డ్యూటీకి రాకపోవడంతో సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో కనిపించారు. కుటుంబ కలహాలే కారణమా? మరేవైనా సమస్యలు ఉన్నాయా? అనేది తెలియాల్సిఉంది…