Thursday, June 13, 2024
Homeతెలంగాణయేసుక్రీస్తు జన్మతోనే మానవాళికి పాప విమోచన

యేసుక్రీస్తు జన్మతోనే మానవాళికి పాప విమోచన

యేసుక్రీస్తు జన్మతోనే మానవాళికి పాప విమోచన

మంథని నవంబర్ 27(కలం శ్రీ న్యూస్):యేసుక్రీస్తు కన్య మరియ గర్భంలో జన్మించడం ద్వారానే లోకానికి రక్షణ, పాప క్షమాపణ దొరికిందని మంథని నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి ప్రభాకర్ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని సీయోను ప్రార్ధన మందిరంలో మంథని మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవులందరి పాపాలు క్షమించడానికే ఈ లోకంలో మానవ అవతారిగా కన్య మరియ గర్భంలో జన్మించాడని, కామ, కోద, మద, మత్సరాలు లేకుండా జీవించి మానవులందరికీ ప్రేమను పంచాడన్నారు. మానవులందరి పాప పరిహారార్థమే యేసుక్రీస్తు సిలువ మరణం పొంది త్యాగమూర్తిగా నిలిచాడన్నారు. క్రిస్మస్ వేడుకలను వాడ వాడలా జరుపుతూ యేసుక్రీస్తు జన్మదిన ప్రాముఖ్యతను వివరిస్తూ నేల రోజుల పాటు జరుగనున్న క్రిస్మస్ ఉత్సవాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ కు మంథని నియోజక వర్గ పాస్టర్ల అసోసియేషన్ మద్దతు ప్రకటిస్తుందని, ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆయన విజయం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ కార్యదర్శి కాంపల్లి దాస్ సహాయ కార్యదర్శి సాత్విక్, సీయోను సంఘాల పాస్టర్లు మంథని మార్క్ పెండ్లి ప్రసన్నకుమార్, కలువల సామ్యూల్, అజ్మీరా దయారాజ్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!