Friday, December 27, 2024
Homeతెలంగాణహత్యలు చేసిన నాయకులకు చెంప చెల్లు మనేలా ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలి.

హత్యలు చేసిన నాయకులకు చెంప చెల్లు మనేలా ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలి.

హత్యలు చేసిన నాయకులకు చెంప చెల్లు మనేలా ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలి.

మంథని,నవంబర్27(కలం శ్రీ న్యూస్):మంథని టౌన్ లో బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని టౌన్ లో ఉన్న ప్రతీ ఒక్క షాప్ యజమానులను కలిసి ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల నారాయణ రెడ్డి.అనంతరం మంథని టౌన్ లో డా. బీ. ఆర్. అంబేద్కర్ గ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా చల్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ. నియోజకవర్గాన్ని ఈ ఇద్దరు నాయకులు దోచుకొని దాచుకున్నారని,నియోజకవర్గంలో హత్యలు చేసిన నాయకులకు చెంప చెల్లుమనేలా ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలని,ఇద్దరు నాయకులు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని,మంథని నియోజకవర్గాన్ని 30సంవత్సరాలు వెనక్కి నెట్టేసారని,వాళ్ళు కోట్ల విలువ చేసే ఇండ్లు కట్టుకున్నారు కానీ పేద ప్రజలకు ఒక్క ఇళ్ళు కూడా కట్టించలేదని,నన్ను ఎమ్మెల్యే గా గెలిపించండి మంథని నియోజకవర్గంలో గుడిసె లేని నియోజకవర్గంగా చేసి చూపిస్తానని,మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే భాద్యత నాదేనని,ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి మీ పాదసేవ చేస్తానని,మంథని నియోజకవర్గంలో బహుజన రాజ్యాన్ని నిర్మించుకుందామని,నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని, ఓటు అనే ఆయుధంతో బుద్ది చెప్పాలి. ఏనుగు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!