Saturday, July 27, 2024
Homeతెలంగాణఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు సేవకుడిగా పని చేస్తా

ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు సేవకుడిగా పని చేస్తా

ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు సేవకుడిగా పని చేస్తా

ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్27(కలం శ్రీ న్యూస్):నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన ఒక్క కుటుంబం ఎదిగినోళ్లను ఎదిగినట్లు ఖతం చేసేందుకు చూస్తున్నారని, రాజకీయంగా ఎవరిని ఎదగకుండా అణిచి వేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంథని మండలం గుంజపడుగు, నాగారం, ఆరెంద గ్రామాల్లో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యే అభ్యర్థికి బ్రహ్మరథం పట్టారు. ఊరి పొలిమేరళ్లోనే ఘన స్వాగతం పలికి ప్రదర్శనగా ప్రదాన కూడలి వరకు తీసుకెళ్లారు. మహిళలు మంగళహరతులతో స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనేక ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఈ ప్రాంత ప్రజలు గోస పడ్డారని ఆయన గుర్తు చేశారు. అభివృధ్ది,సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం పదవులు కోసమే ఆరాటపడ్డారని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రస్తుత కాంగ్రెస్‌ అభ్యర్థి పని కోసం పోతే మా ప్రభుత్వం లేదని మాట దాటేశాడని, మళ్లీ మనం ఓట్లు వేస్తే ఏం పనిచేస్తాడని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి ఓట్ల కోసం నోట్ల సంచులు తీసుకువచ్చి ప్రజలను మభ్యపెట్టడం అలవాటుగా మారిపోయిందన్నారు. తాను మీ ఆశీర్వాదంతో మీ కళ్ల ముందే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్‌గా ఎదిగితే అనేక కుట్రలు, అబద్దాలు చెప్పి ప్రజలకు దూరం చేశారని, మళ్లీ ఈనాడు అబద్దాలు, అసత్య ప్రచారాలు,అబండాలు వేస్తున్నారని తెలిపారు. చైతన్యవంతులైన ప్రజలు ఏవీ నిజాలు, ఏవి అబద్దాలని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. గత 15ఏండ్లుగా తనను రౌడీ,గుండా, అవినీతి పరుడని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేశారని, వాళ్లు ఆరోపించిన ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రజలను తప్పుతోవ పట్టించేలా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని ఆయన వివరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎదుగుదలకు అడ్డుగా ఉన్నానని తన అడ్డు తొలగించుకుంటే ఇక ఎదురుండదని అనేక కుట్రలు చేస్తున్నారని అన్నారు. మాజీలను, రౌడీలను,స్మగ్లర్లను పార్టీలో చేర్పించుకుని తనను రాజకీయంగా చంపేందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తుపాకులు పట్టుకుని అడవిబాట పట్టినోళ్లు ఆ తుపాకుడు విడిచి వచ్చి మళ్లీ అదే పార్టీలోకి వెళ్తున్నారని, వీళ్లంతా ఒక్కటై తనను అంతం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు.నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అనేక అభివృధ్దిపనులు చేశానని, ఎంతో మంది బీదోళ్లను సేవలు అందించానన్నారు. ఈనాటి వరకు మీ కళ్ల ముందే తాను చేసిన అభివృధ్ది, సేవలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఐదేండ్లు కాంగ్రెస అభ్యర్థికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కనీసం ఏ ఆడబిడ్డ పెండ్లికైనా పుస్తె మట్టెలు ఇచ్చాడా, ఓ బీదబిడ్డ చదువుకు రూపాయి సాయం చేశాడా అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఈనాడు నన్ను కాపాడుకుంటే రేపటి తరాల భవిష్యత్‌ బాగుంటుందని, తన తర్వాత ఎవరైనా రాజకీయంగా ఎదిగేఅవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాను ఒక్కడినే పదవిలో ఉండకూడదని, తనవెంట తిరిగేవాళ్లు సైతం పదవుల్లో ఉండి గౌరవించబడాలని ఆలోచించే వ్యక్తినని, ఈ క్రమంలోనే గరీబు బిడ్డలని ఆదరించి అక్కున చేర్చుకుంటే నమ్మించి మోసం చేశారని, పార్టీలో ఉన్నప్పుడు తనను దేవుడని గొప్పలు చెప్పినోళ్లు ఈనాడు పార్టీ మారి తనను బదనాం చేస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రామగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఏకంగా తనను బెదిరింపులకు గురి చేసిన రికార్డులు ఉన్నాయని మీడియా ముందు చెప్పి కాంగ్రెస పార్టీలో చేరి ఐదు రోజులైనా ఒక్క రికార్డును బయటపెట్టలేదన్నారు. తాను ఏనాడు తప్పు చేయలేదని, ఎవరిని బెదిరింపులకు గురి చేయలేదని స్పష్టం చేశారు. ఈనాడు మనం వేసే ఓటు ఐదేండ్లు వృధా కాకుండా ఉండాలని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు, అభివృధ్దిని చూసి ఓటు వేయాలన్నారు. మళ్లీ సీఎం కేసీఆర్‌ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాల అమలుకు రూపకల్పన చేయడం జరిగిందని, ముఖ్యంగా రైతుబీమా తరహాలో కేసీఆర్‌ బీమా ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తుందన్నారు. ప్రతి గృహిణి ఇంటి అవసరాల కోసం సౌబాగ్యలక్ష్మిపేరిట నెలకు మూడువేలు ఇవ్వడం జరుగుతుందని, అంతేకాకుండా రైతుబంధు పెట్టుబడిసాయం, పించన్‌ల పెంపు, నాలుగు వందలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇలా అనేక సంక్షేమపథకాలు అమలు చేస్తామన్నారు.ఈ ప్రభుత్వ పథకాలతో పాటు తాను సొంతంగా కొన్ని పథకాలు అమలు చేస్తానని, గతంలో చేసినట్లుగానే పేదింటి ఆడబిడ్డలకు సామూహిక వివాహాలు, పేద విద్యార్దులకు హైదరాబాద్‌లో హస్టల్‌లు ఏర్పాటు చేసి రూపాయి ఖర్చు లేకుండా చదివించే బాధ్యత తనదేనన్నారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి మాత్రం ఆరు అబద్దపు పథకాలే చెప్తున్నాడే కానీ ఐదేండ్లలో ఏం చేస్తడో చెప్తలేడని, కండువా వేసుకున్న నాయకులు సైతం ఏం చేస్తారో చెప్తలేరన్నారు.అంటే కేవలం ఎన్నికలు వచ్చాయంటే ఓట్ల కోసం నోట్ల సంచులతో వస్తే చాలని అనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇటీవల మంథనికి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుంజపడుగును మండలంగా ప్రకటిస్తానని మాట ఇచ్చారని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ అధికారంలోకి రాగానే తాను ఎమ్మెల్యేగా నెలరోజుల్లో గుంజపడుగును మండలంగా ఏర్పాటు చేయించి అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా తన చిరకాల స్వప్నమైన ఆరెంద మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని నెరవేర్చుతానని ఆయన స్పష్టం చేశారు.ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఆరెందకు వెలుగులు వస్తాయని, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వేయి కోట్లలో రెండువందల కోట్లు ఇక్కడే పెట్టి నిర్మాణం చేయిస్తానన్నారు. అదే విధంగా ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో నష్టపోతున్న రైతులకు వందశాతం న్యాయం చేస్తానని, ఆరెంద, మల్లారం గ్రామాల్లో ముంపుకు గురవుతున్న భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చూస్తానని ఆయన హమీ ఇచ్చారు. ఇటు సంక్షేమ పథకాలు, తన సేవలు, అభివృధ్ది పనులు ముందుకు సాగాలంటే రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌, మంథనిలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఈ పనులతో పాటు గ్రామాల్లో తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతి పనిని పూర్తి చేసే బాధ్యత తనదేనని ఆయన హమీ ఇచ్చారు. ప్రజలంతా గొప్పగా ఆలోచన చేసి తనను ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీకు అందుబాటులో ఉండి సేవకుడిగా పనిచేస్తానని ఆయన హమీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!