Tuesday, December 3, 2024
Homeతెలంగాణవిజ్జన్నకి ఘన స్వాగతం పలికిన ఓదెల గ్రామ మహిళలు గ్రామప్రజలు

విజ్జన్నకి ఘన స్వాగతం పలికిన ఓదెల గ్రామ మహిళలు గ్రామప్రజలు

విజ్జన్నకి ఘన స్వాగతం పలికిన ఓదెల గ్రామ మహిళలు గ్రామప్రజలు

ఓదెల,నవంబర్27(కలం శ్రీ న్యూస్):ఓదెల మండలంలోని,ఓదెల గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణా రావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి మనోహర్ రెడ్డి ని దత్తత గ్రామం అయినా ఓదెల గ్రామానికి ఏం అభివృద్ధి చేసావో చెప్పాలని,ఓదెల మండలంలో ఉన్న సహజ వనరులను, రైతుల వడ్ల కటింగ్ పెట్టి వేలకోట్లు దోచుకున్న ఈ ఎమ్మెల్యే.నియంత దాసరి మనోహర్ రెడ్డి అవినీతి పాలన నుండి విముక్తి పొందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని,బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కావాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని,గడిచిన 10 ఏండ్లలో అధికారంలో ఉన్నటువంటి బి.అర్.ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఓదెల గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇయ్యాలేదని,నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కూడా కల్పించలేదన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో పూర్తిచేస్తుందని,రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తుందని రెండు లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు,నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని,ప్రతి ఇంట్లో ఆడ బిడ్డ పేండ్లికి ఒక లక్ష రూపాయలు, తులం బంగారం ఇస్తుందన్నారు.తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!