బీఎస్పీ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాపాలన వస్తుంది
పెద్దపల్లి,నవంబర్27(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి పట్టణం 8వవార్డ్, చందపల్లిలో గ్రామంలో ఇంటింటికి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష ఎన్నికల ప్రచారం నిర్వహించి అనంతరం ఆమె మాట్లాడుతూ బీఎస్పీ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాపాలన వస్తుంది అన్నారు. తెలంగాణాలో నిరుద్యోగుల పక్షాన, రైతుల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అన్నారు. నియోజకవర్గం లో ఎక్కడ సమస్య ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ ఇంత దూరం వచ్చానన్నారు. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే మీ సేవకురాలిగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మండల మాజీ జడ్పిటిసి ఈర్ల కొమరయ్య, 8వ వార్డ్ కౌన్సిలర్ బొంకురి భాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ, పోతని పురుషోత్తం, బీఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.