ఓటమి భయంతోనే కల్వకుంట్ల కుటుంబం పలుమార్లు పెద్దపల్లి కి రాక
సుల్తానాబాద్,నవంబర్27(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల, కొదురుపాక, నారాయణపూర్ గ్రామంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష ఎన్నికల ప్రచారం నిర్వహించి అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి దాసరి ఉష మాట్లాడుతూ…. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు 400 కి గ్యాస్ ఇస్తాం 500 గ్యాస్ ఇస్తామని పోటీపడి అధికారంలోకి రావడం కోసం దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. నిజంగానే పేదల కోసం 500 గ్యాస్ ఇవ్వాలనుకుంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు? అలాగే పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే కల్వకుంట్ల కుటుంబం పలుమార్లు పెద్దపల్లి కి వచ్చిన పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు.కాంగ్రెస్ పార్టీ మిగతా 5 రాష్ట్రంలో అధికారంలో ఉన్న 400 రూపాయలకు గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు? కేవలం అధికారం కోసమే ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఇద్దరు దొరలతో విసిగిపోయిన పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు ఒక బీసీ బిడ్డగా ప్రజాసేవ కోసం వచ్చినటువంటి నాకు ఒక అవకాశం కల్పించాలన్నారు. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధిలో ముందుండే విధంగా మహిళలను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గoలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, పెద్దపెల్లి మాజీ జెడ్పిటిసి ఈర్ల కొమరయ్య, భూసనవేణి సమ్మయ్య – సుజాత గౌడ్, మీనుగు సుధాకర్,ఎలిగేటి కనుకయ్య,ఎలిగేటి మహేందర్, ఎలుగం కనకయ్య, ఎలుగం రమేష్, తదితరులు పాల్గొన్నారు.