75 సంవత్సరాల నుండి మనల్ని బానిసలుగా చేసింది ఈ దొంగ పాలకులే
పెద్దపల్లి,నవంబర్26(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో వద్ద బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి బిఎస్పీ మేనిఫెస్టో లోని సంక్షేమ పథకాలను వివరిస్తూ మేనిఫెస్టో కరపత్రం అందజేయడం జరిగింది. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ 75 సంవత్సరాల నుండి మనల్ని బానిసలుగా చేసింది ఈ దొంగ పాలకులని ధ్వజమెత్తారు. అగ్రవర్ణాలు బహుజనులను అధికారునికి దూరం చేస్తున్నారన్నారు. బహుజన సమాజ్ పార్టీకి ఓటేస్తే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇకనైనా మేల్కొని మన ఇంటి పార్టీ అయినా బహుజన్ సమాజ్ పార్టీ 2వ నెంబర్ ఏనుగు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ బీఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష కి మద్దతు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాపోలు వీర మోహన్, మహిళా అధ్యక్షురాలు చిడం ఆకాశపు సునీత, రాపోలు వెంకటేశ్వర్లు, అనుమూల కళావతి తోపాటు బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.