మానవత్వం చాటుకున్న నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు
ఎలిగేడు,నవంబర్25(కలం శ్రీ న్యూస్):ఎలిగేడు మండలంలోని దూళికట్ట గ్రామంలో దేవ అనసూర్యకు ఇద్దరు పిల్లలు ఒక కొడుకు, ఒకబిడ్డ,…బిడ్డ చనిపోయి సంవత్సరం గడవకముందే ఇప్పుడు కొడుకు దేవ రాజు(52) గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. కొడుకు మరణంతో దేవ అనసూర్య అనాధగా మిగిలింది. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి. కడు పేదరికంతో, పుట్టెడు దుఃఖంలో ఉన్న వీళ్ళ కుటుంబానికి నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు 25కిలోల బియ్యం, 2000 రూపాయల నగదు ను ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. అలాగే రాజు పార్థివ దేహానికి ట్రస్ట్ నుండే వైకుంఠ రథ వినియోగించడం జరిగింది. ఆర్థిక సహాయాన్ని అందించిన ట్రస్టు సభ్యులకు మృతుని కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధానకార్యదర్శి వెంగళ్ దాస్ అశోక్, ట్రస్ట్ ఆర్గనైజింగ్ వీరగొని లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ బాలసాని పరుశరాములు గౌడ్, దేవ అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.