Saturday, April 20, 2024
Homeతెలంగాణసాయం చేయనోళ్లు ఓట్ల కోసం గడియారాలు ఇస్తుండ్లు

సాయం చేయనోళ్లు ఓట్ల కోసం గడియారాలు ఇస్తుండ్లు

సాయం చేయనోళ్లు ఓట్ల కోసం గడియారాలు ఇస్తుండ్లు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్24(కలం శ్రీ న్యూస్):తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నాలుగేండ్లు ఎమ్మెల్యేగా, ఐదేండ్లు జెడ్పీ చైర్మన్‌గా చేసిన అభివృధ్ది పనులు, సేవలు మీ కళ్లముందే కన్పిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి కాటారం మండలం గంగారం, విలాసగర్, దామెరకుంట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈప్రాంతంలోని పేద వర్గాలకు తనవంతు సేవలు అందించానని, అంబలి కేంద్రాల నుంచి మొదలు అంబులెన్స్‌లు, విద్యా, వైద్యం అందించామని, పేద విద్యార్ధుల ఆకలి తీర్చామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు సేవలు అందిస్తూ మీ కుటుంబ సభ్యుడిలా ముందుకు సాగుతుంటే కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 15ఏండ్లుగా అబద్దాలతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో అసత్య ప్రచారాలు, అబండాలు వేసిప్రజలకు దూరం చేశారని, ఈనాడు బీఆర్‌ఎస పార్టీ నాయకులను కొనుగోలు చేసి వాళ్లతోనే దుష్ప్రచారాలు చేయిస్తున్నారని అన్నారు. రామగిరికి చెందిన ఓ ప్రజాప్రతినిదిని తాను చంపుతానని బెదిరింపులకు గురి చేశానని, దానికి సంబంధించిన రికార్డులు ఉన్నాయని మీడియాకు ప్రకటించి ఇప్పటి వరకు ఆ రికార్డులు చూపించలేదన్నారు. తాను ఏనాడు తప్పు చేయనని , తాను చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తానని అన్నారు. పేద వర్గాలు పైకి రావాలన్నదే తన లక్ష్యమని ఆ దిశగా ఎంతో మందిని ప్రోత్సహించి రాజకీయంగా అందలం ఎక్కిస్తే తనను మోసం చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పటికే కాంగ్రెస పార్టీ అభ్యర్థి అనేక కుట్రలు చేస్తున్నాడని, మాజీ నక్సలైట్లను, రౌడీలను, స్మగ్లర్లను పార్టీలో చేయించుకుని తనను రాజకీయ సమాధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా అధికారం ఇస్తే ఏనాడు సాయం చేయనోళ్లు ఈనాడు ఓట్ల కోసం గడియారాలు చీరలు ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చకుండా కేవలం ఓట్ల కోసం, కుర్చీ కోసమే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆరాటపడుతున్నాడనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.నాలుగేండ్లు ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే బీదబిడ్డలకు పెండ్లిళ్లు, విద్యార్ధులకు చదువులు, ఆస్పత్రి ఖర్చులు, సాయాలు, సేవలు అందించామని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి సేవలు చేయకుండా ఈనాడు ఓట్ల కోసం ఆరుపథకాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని, నన్ను కాపాడుకుంటారో ఖతం చేసుకుంటారో నిర్ణయం మీదేననిఅన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వేయి కోట్లు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గొప్ప గొప్ప పథకాలతో పాటు అభివృధ్దికి నిధులు వస్తాయని అన్నారు. ఇప్పటికే గంగారంలో ప్రతి గల్లీ సీసీ రోడ్డు వేశామని, బురదలేని రోడ్లు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాంగానే రైతుబంధు పెట్టబడి సాయం, ఆసరా పించన్‌ల పెంపు, రైతుబీమా తరహాలో కేసీఆర్‌ బీమా, ప్రతి గృహిణికి సౌభాగ్యలక్ష్మిపేరిట నెలకు మూడు వేలు, నాలుగు వందలకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలు అమలు అవుతాయన్నారు. ఈ ప్రభుత్వ పథకాలతో పాటు తాను సొంతంగా కొన్ని సేవలు అందిస్తానని, ప్రతి సంవత్సరం పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు, హైదరాబాద్‌లో చదువుకునే పేద విద్యార్ధులకు హస్టల్‌ వసతి కల్పించి రూపాయి ఖర్చు లేకుండా చదివిస్తానని హమీ ఇచ్చారు. అదే విధంగా గృహలక్ష్మిపథకం ద్వారా ఇండ్లు మంజూరీ చేయించి మూడు లక్షలతో పాటు కొంత సాయం చేసి ఇంటి నిర్మాణం చేయిస్తానని అన్నారు.తనను ఆదరించి ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే ఐదేండ్లు సేవకుడిగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!