Saturday, July 27, 2024
Homeతెలంగాణఏనుగు ఘీoకరా సభతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టింది -

ఏనుగు ఘీoకరా సభతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టింది –

ఏనుగు ఘీoకరా సభతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టింది –

బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష

పెద్దపల్లి,నవంబర్24(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి, కాసులపల్లి, అప్పన్నపేటకు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, యువకులు కొలిపాక సాగర్, కుంచప్ప అప్ప స్వామి, కాటబోయిన సంపత్, వేమన నరసయ్య, పిట్టల ప్రశాంత్, దామ శంకర్, జంగిలి రాజేందర్, పలువురు నాయకులు బీఎస్పి పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. అనంతరం వారు మాట్లాడుతూ ఏనుగు ఘీoకార సభతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టిందని అన్నారు. బీఎస్పీ భారీ మెజార్టీతో గెలవబోతుందని, నిన్న జరిగిన ఏనుగు ఘీoకార సభతో ప్రజలు నిర్ధారించారన్నారు.బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు అదే ఉత్సాహంతో 30వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్ లో చురుగ్గా పాల్గొని బీఎస్పీ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అనంతరం పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు వద్ద శుక్రవారం రోజున ముస్లిం సోదరులను కలిసి నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయాలని ముస్లిం సోదరులను అభ్యర్థించిన బీఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు రామిల్ల శారద, పట్టణ ఉపాధ్యక్షులు మాచర్ల బబ్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎం డి అజీమ్, పెద్దపెల్లి మండల జడ్పిటిసి బండారి రామ్మూర్తి, పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్ బొంకూరి సురేందర్ సన్నీ, పోతానీ పురుషోత్తం, మాజీ కౌన్సిలర్ మరిపల్లి సతీష్, ఎండి సాదిక్, ఎండి సిద్ధిక్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!