కేసీఆర్ సర్కార్ లోనే కార్మికులకు న్యాయం
బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని,నవంబర్24(కలం శ్రీ న్యూస్):ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్‌లోని సింగరేణి కార్మికులకు న్యాయం జరిగిందని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు.
రామగిరి మండలం సెంటనరీకాలనీ నుంచి మంథని వరకు సింగరేణి యువ కార్మికులు చేపట్టిన పాదయాత్రకు ఓ.సి.పి-2 వద్ద స్వాగతం పలికారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వెలుగులు అందించే సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసి ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి మంథని నియోజకవర్గ అభ్యర్థిగా తన గెలుపు కోసం పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సింగరేణి యువ కార్మికులను ఆదర్శంగా తీసుకుని యువకులు గొప్పగా ఆలోచన చేసి మంచి నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన ఈసందర్బంగా యువతకు పిలుపునిచ్చారు.