Saturday, July 27, 2024
Homeతెలంగాణనన్ను కాపాడుకుంటరో...ఖతం చేసుకుంటరో నిర్ణయం మీదే

నన్ను కాపాడుకుంటరో…ఖతం చేసుకుంటరో నిర్ణయం మీదే

నన్ను కాపాడుకుంటరో…ఖతం చేసుకుంటరో నిర్ణయం మీదే

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్24(కలం శ్రీ న్యూస్):మీ కళ్ల ముందే బీసీ బిడ్డగా ఎదిగితే కాంగ్రెస్సోళ్లకు అడ్డుగా ఉన్నానని అంతం చేయాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రామగిరి మండలం రామయ్యపల్లి, రాజాపూర్,ఆదివారంపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టో, ప్రభుత్వ పథకాలు, సేవలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి ఎదిగి మీ తమ్ముడిలా, అన్నలా, కొడుకులా పనిచేస్తుంటే అబద్దాలు అసత్య ప్రచారాలతో దూరం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 15ఏండ్లుగా తనపై తప్పులు ఆరోపణలు, అబండాలు వేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటి వరకు కాంగ్రెస్సోళ్లు చేసిన ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేదన్నారు. మీ సమస్యలను నా సమస్యలుగా భావించి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజలకు సేవలు అందించానే తప్ప ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రామగిరి మండలానికి చెందిన గరీబు బిడ్డ అని గౌరవంగా బతుకాలని అందలం ఎక్కిస్తే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంచనచేరి తనపైనే బురదజల్లుతున్నారని అన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తోటి ప్రజాప్రతినిధులతో మంచిగా ఉండాలని చెప్పితే తమను తిట్టారని, బెదరించారంటూ మీడియా ముందుకు వచ్చి అనేక సాక్ష్యాలున్నాయని చెప్పారని, ఈనాటికి ఆ సాక్ష్యాలు ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. సదరు ప్రజాప్రతినిధి చెక్కులపై సంతకాలు పెట్టినవి, వికలాంగుడి భూమి లాక్కున్న రికార్డులు తమ వద్ద ఉన్నాయని ఆయన వివరించారు. ఈనాడు మన బీసీ,ఎస్సీ, ఎస్టీలను అక్కున చేర్చుకుని మన పైనే ఎమ్మెల్యే అభ్యర్థి దాడులు చేయిస్తున్నాడని అన్నారు. ఎక్కడ గొడవ జరిగినా తననే టార్గెట్‌ చేస్తున్నారని, నామీదనే కేసులు పెట్టిస్తున్నాడని ఆయన అన్నారు. ఓడేడ్‌ గ్రామానికి చెందిన సర్పంచ్‌ మీనాజీపేటకు పోయి అక్కడి మాజీ జెడ్పీటీసీపై దాడి చేసి ఆ ఘటనలో తనను బాధ్యుడిని చేసి కేసు పెట్టారని, అంతేకాకుండా సదరు సర్పంచ్‌ ఒరే పుట్ట మధూ నీ అంతుచూస్తా…కాంగ్రెస్‌ కార్యకర్తలంతా బీఆర్‌ఎస్‌ నాయకుల ఇండ్లపై దాడులు చేయండి అంటూ నినాదాలు చేసిన తీరుపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మాజీ నక్సలైట్లు, రౌడీయిజం చేసేవాళ్లు, స్మగ్లర్లను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి తనను ఖతం చేయాలని కుట్రలు చేస్తున్నాడని అన్నారు. తన అడ్డు తొలగించుకుంటే ఇక హైదరాబాద్‌లో ఉండే పాలన చేయవచ్చని బావిస్తున్నాడని అన్నారు. ఎన్నికల రాగానే ఏం జరుగుతుందో ఆలోచన చేయకపోవడం మూలంగా పెద్ద ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు, యువకులు ఆలోచన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ఆలోచన చేయకపోవడంతోనే మోసం చేసిన వాళ్లే మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. ఐదేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కాంగ్రెస్‌ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేయకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్నాడని, ఈనాడు ఓట్లకు వస్తే ఏం చేశావని అడుగాలని అన్నారు. తనకు నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎంతో అభివృధ్ది చేశానని, ఎంతో మంది పేద బిడ్డల పెండ్లిళ్ళు, కేసీఆర్‌ పథకాలను అమలు చేశానని, అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే సాక్ష్యాలుగా ఉన్నాయన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తాను ఓట్లతో సంబంధం లేకుండా పనిచేశానని, గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలను కుటుంబసభ్యులుగా బావించి తనవంతు సాయం చేశానన్నారు. బీసీ బిడ్డగా ఎదిగిన తనను ఖతం చేస్తే మళ్లీ ఇంకా ఎవరు పైకి వస్తారని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు వస్తే పైసలు, గడియారాలు, చీరలు పంచి అధికారంలోకి రావచ్చనే ఆలోచన తప్ప ఓట్లు వేసిన ప్రజలకు సాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌ అభ్యర్థికి లేదన్నారు. ఐదేండ్లు అవకాశం ఇస్తే కనీసం చెంచెడు నీళ్లు పోసిండా, ఓ ఆడబిడ్డ పెండ్లికి పుస్తె మట్టెలు, పేద విద్యార్ధి చదువుకు సాయం చేసిండా అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదని, ఈనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పథకాలు, నా సేవలు ముందుకు సాగాలంటే తనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, మళ్లీ అధికారంలోకి రాంగానే వాటితో పాటు రైతుబీమా తరహాలో కేసీఆర్‌ బీమా, సౌబాగ్యలక్ష్మి పేరిట ప్రతి గృహిణికి ఇంటి అవసరాల కోసం రూ.3వేలు, రైతుబంధు పెట్టుబడ సాయం, ఆసరా పెంచన్‌ల పెంపులతో పాటు గొప్ప పథకాలు అమలు అవుతాయన్నారు. ఈ పథకాలతో పాటు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పేదింటి ఆడబిడ్డలకు పెండ్లి, హైదరాబాద్‌లో చదువుకునే విద్యార్ధులకు హస్టల్‌ వసతి కల్పించి రూపాయి ఖర్చు లేకుండా చదవిస్తానని, గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి మూడు లక్షలతో పాటు తాను కొంత సాయం అందించి ఇల్లు నిర్మించి ఇస్తానని హమీ ఇచ్చారు. మీ బిడ్డల భవిష్యత్‌ బాగు కోసం ఆలోచన చేయాలని, ఎమ్మెల్యేగా ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీ సేవకుడిగా పనిచేస్తానని ఆయన హమీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!