Saturday, July 27, 2024
Homeతెలంగాణమీ ఆశీర్వాదమే అభివృధ్దికి బాట వేస్తది

మీ ఆశీర్వాదమే అభివృధ్దికి బాట వేస్తది

మీ ఆశీర్వాదమే అభివృధ్దికి బాట వేస్తది

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్24(కలం శ్రీ న్యూస్):మీ ఆశీర్వాదం..ఆదరణ మంథని అభివృధ్దికి బాటలు వేస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు.మంథనిలోని హామాలీ కార్మికులను ఆయన కలిసి కాసేపు మాట్లాడారు. ఉదయం వాకింగ్‌ అనంతరం హమాలీ సంఘ కార్యాలయంలో కార్మికులను కలిసి బీసీ బిడ్డగా తనను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా మంథని ప్రజల కష్టాలు తీర్చారని, అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ముఖ్యంగా హమాలీ కార్మికుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నానని, కష్టపడి పనిచేసే వాళ్లను ఎక్కువగా ఇష్టపడుతానని అన్నారు. మంథని ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత నాదేనని, మరోమారు అవకాశం కల్పించి ఆదరించి ఆశీర్వాదం అందించాలని ఆయన హమాలీ కార్మికులను కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!