ప్రతి వాకింగ్ ఏరియాలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తా
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్తి పుట్ట మధూకర్
మంథని,నవంబర్24(కలం శ్రీ న్యూస్):బారత రాజ్యాంగంలో రాసుకున్నట్లుగా ప్రతి మనిషి అన్ని సౌకర్యాలతో మానసిక ప్రశాంతంగా జీవించాన్నట్లుగా మంథనిలో మంచి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు.
మంథని లో వాకర్స్, ఓపెన్ జిమ్ అసోసియేషన్ సభ్యులతో అల్పాహార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వాకర్స్, జిమ్ అసోసియేషన్ సభ్యులు సమిష్టిగా తనను ఆశీర్వదించేందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా మీ కళ్ల ముందే ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, జెడ్పీచైర్మన్‌గా ఎదిగానని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ మట్టిని ఏ విధంగా ప్రేమిస్తున్నానో, అభివృధ్దికి ఎలా పరితపిస్తున్నానో చూస్తున్నారని అన్నారు. ఇప్పటికే బొక్కలవాగును మినీట్యాంక్‌బండ్‌గా, చెక్‌డ్యాం నిర్మాణం, చెరువులు, గ్రౌండ్‌లను సుందరీకరించి, వాకింగ్ ట్రాక్స్‌లు, లైటింగ్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే అనేక విధాలుగా మంథని అభివృధ్దికి బాటలు వేశామని తెలిపారు. మంథని ప్రజల అభిష్టం మేరకు ప్రతి వాకింగ్ ఏరియాలో ఓపెన్ జిమ్‌లు, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తామని చెప్పారు. అలాగే ఔటర్‌రింగ్ రోడ్డు వేసి నాలుగుప్రాంతాలు అభివృధ్ది చేయడానికి ఆలోచనలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఆరోగ్యమే మహాబాగ్యం అనిపెద్దలు చెప్పినట్లుగా మంథని ప్రజలకు మంచి ఆరోగ్యం, మంచి వాతావరణం కల్పించాలన్నదే లక్ష్యమన్నారు.కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులను అందరం చూశామని, అలాంటి పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేలా మంచి వాతావరణం కల్పించేలా దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. నాయకుడంటే ఆకాశం నుంచి ఊడిపడేవాదు కాదని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేవాడని ఆయన వివరించారు. ఇప్పటికే పదేళ్లలో తాను ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించానని ఆయన తెలిపారు. మీ దీవెనలు, ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి మంథనిని సుందరీకరించి మంచి వాతావరణం కల్పిస్తానని ఆయన హమీ ఇచ్చారు. అనంతరం వాకర్స్, జిమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ శాలువాతో సన్మానించారు.