Thursday, September 19, 2024
Homeతెలంగాణఘనంగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

ఘనంగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

సుల్తానాబాద్ నవంబర్23 (కలం శ్రీ న్యూస్ ):బహుజన సమాజ పార్టీ అధ్యక్షులు ఘనంగా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలో జవహర్ నగర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల కోసం తన ఉన్నత పదవిని త్యాగం చేసి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం తో బిఎస్పీ పార్టీలో చేరి పార్టీ  రాష్ట్ర అధ్యక్ష భాద్యతలు చేపట్టి, నిత్యం ప్రజల కోసం శమిస్తున్న గొప్ప వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని, రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టీ, బడుగు, బలహీన వర్గాలకు మరింత  అండ ఇవ్వాలని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలు  ఏకతాటి పైకి వచ్చి బిఎస్పీ పార్టీ ని అధిక మెజారిటీ తో గెలిపించి  రాష్ట్రములో మార్పు తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ఉపాద్యక్షులు తోట వెంకటేశ్,కొ ఆప్షన్ సభ్యులు డాక్టర్ కలీమ్,సీనియర్ నాయకులు ఆరేపల్లి జితేందర్,కొండ రజిత,ఆరేపల్లి రాహుల్,కొండ శ్రీధర్,తోట మధు లతో పాటు పలువురు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!