గర్రెపల్లి ఆదర్శ పాఠశాల లోబాలికలు అన్ని రంగాలల్లో ముందుండాలి
సుల్తానాబాద్,నవంబర్23(కలం శ్రీ న్యూస్ ): సుల్తానాబాద్ మండలం లోని గర్రెపల్లి మోడల్ స్కూల్లో మహిళ సాధికారిత కేంద్రం అధ్వర్యంలో బాలికలు అవగాహన సదస్సు నిర్వహించి బాలల హక్కుల గురించి, హెల్ప్ లైన్ నంబర్స్ 1098 వంటివాటిని పైన అవగాహన చేపట్టినారు. ఉన్నత చదువు పట్ల, అనేక ప్రభుత్వ స్కాలర్షిప్, సంక్షేమ పథకాల పైన, వారి తల్లితండ్రులకు ఉపయోగ పడే సంక్షేమ పథకాల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జి.సి.డి.ఓ కవిత, ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బిక్షం, మహిళ సాధికారిత కేంద్రం కో- ఆర్డినేటర్ దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ సిహెచ్ స్వప్న, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.