Saturday, July 27, 2024
Homeతెలంగాణరోజురోజుకు పెరుగుతున్న గులాబీ దళం

రోజురోజుకు పెరుగుతున్న గులాబీ దళం

రోజురోజుకు పెరుగుతున్న గులాబీ దళం

పుట్ట మధు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నేతలు

మంథని,నవంబర్23(కలం శ్రీ న్యూస్):పలిమేల టీడీపీ మండల అధ్యక్షుడు కుమ్మరి సుధాకర్ మరియు కోర్లకుంట బీజేపీ నాయకులు, ఉప్పట్ల, సురారం గ్రామాలకు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నుండి భీఆర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో కారు జోరు రోజు రోజుకు పెరిగి వార్‌ వన్‌ సైడ్‌లా కన్పిస్తోంది. మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి నిత్యం బారీగా చేరికలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తాజా, మాజీ ప్రజాప్రతినిదులు గులాబీగూటికి చేరుతున్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖామయని సర్వేలన్నీ చెప్తున్న క్రమంలో చేరికల పర్వం జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అభ్యర్థత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలుపే లక్ష్యంగా వందల సంఖ్యలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ దళంలో చేరుతున్నారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలాలతో పాటు తూర్పు మండలాల్లో కారు దూసుకెళ్తుంటే హస్తం బేజారవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. గత నెల రోజుల క్రితం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ ప్రజాఆశీర్వాద పాదయాత్ర విశేషస్పందన ఇవ్వగా ఈ నెల 07న మంథనిలో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ రాజకీయ సమీకరణాలను తారుమారు చేసింది. ముఖ్యమంత్రి చేసిన ఆసక్తికర మాటలు బహుజనుల్లో ఆలోచింప జేసింది. ఈ క్రమంలో బహుజనవర్గాలకు చెందిన ప్రజాప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా పలిమేల టీడీపీ మండల అధ్యక్షుడు కుమ్మరి సుధాకర్ మరియు కోర్లకుంట బీజేపీ నాయకులు, ఉప్పట్ల, సురారం గ్రామాలకు చెందిన 100 మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృధ్ది సంక్షేమ పథకాలతో పాటు మంథనిలో ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్‌గా పుట్ట మధూకర్‌ చేసిన అభివృధ్ది, సేవలను గుర్తించి బీఆర్‌ఎస్‌పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ గెలుపే లక్ష్యంగా పని చేస్తామని వారు ఈ సందర్బంగా ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!