చీమలపేట ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న నల్ల
జూలపల్లి,నవంబర్22(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం చీమలపేట గ్రామం లో పెద్దపల్లి యంగ్ & డైనమిక్ లీడర్, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు బి.అర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఘనంగా ఆహ్వానించిన చీమలపేట గ్రామ ప్రజలు.ఈ సందర్బంగా నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ బి.అర్.ఎస్ పార్టీ బలపర్చిన పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని, తెలంగాణ రాష్ట్రం లో బి.అర్.ఎస్ పార్టీ అధికారం లో ఉంటేనే కెసిఆర్ ముఖ్యమంత్రి గా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బి.అర్.ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతుబందు,రైతు భీమా,24గంటల కరెంటు, కల్యాణలక్ష్మి, పెన్షన్ లాంటి మరెన్నో పథకాలు ప్రతి పేద ధనిక కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటు వేసి దాసరి మనోహర్ ని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఎంపీపీ కూసుకుంట్ల రమ – రాంగోపాల్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, బి.అర్.ఎస్ పార్టీ కార్యకర్తలు,యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.