ఉత్సాహంగా జిల్లా స్థాయి ఎస్ జిఎఫ్ టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు
సుల్తానాబాద్, నవంబర్ 21(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ టేబుల్ టెన్నిస్ అండర్ 14 అండ్ 17 బాల బాలికల క్రీడా పోటీలు సుల్తానాబాద్ మండలం స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలొ ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇండియన్ పబ్లిక్ పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్ పెద్దపల్లి జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ కొమురోజు శ్రీనివాస్ పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతర వారు మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక దారుణ్యానికి దోహదపడతాయని క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకోవాలని ఓడినంత మాత్రాన కృంగి పోకుండా గెలుపు కోసం ప్రయత్నించాలని అన్నారు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణప్రియ,ఎస్ జి ఎఫ్ మండల కన్వీనర్ దాసరి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు ఆసియా,సోమశేఖర్, సత్యం, ఇక్బాల్, శివ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.