మనసున్న మహా ‘లక్ష్మి’…
మంథని,నవంబర్21(కలం శ్రీ న్యూస్);రూపాయి రూపాయి పోగు చేసిన ఈ అవ్వ మన మధన్న గెలుపు కోసం పది వేలు సాయం చేసింది. మంథని మండలం మల్లెపల్లి గ్రామానికి చెందిన ఎరుకల లక్ష్మి అనే అవ్వ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు ఎన్నికల ఖర్చుల కోసం రూ.10వేలు సాయం అందించింది. మల్లెపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనను కలిసిన లక్ష్మి పుట్ట మధన్నను ఆశీర్వదిస్తూ పదివేలు అందజేసింది. పేదింటి బిడ్డ ఎమ్మెల్యేగా గెలిస్తే మనలాంటోళ్లకు ఎంతో మందికి సాయం చేస్తాడంటూ తన మనసులోని మాటను లక్ష్మి చెప్పింది.అనంతరం ఆమె చేసిన మంచి పనికి పలువురు ఆమెను అభినందించారు.