బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం
సుల్తానాబాద్,నవంబర్21(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని 15వ (బూత్ నంబర్ 199) వార్డ్ లో భారతీయ జనతా పార్టి పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ గుర్తు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ప్రదీప్ పెద్దపల్లి అసెంబ్లీ స్థానంలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భముగా బిజెపి మేనిఫెస్టో ను ప్రజలకు వివరించి బిజెపి అభ్యర్థి ప్రదీప్ ని గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అద్యక్షులు కూకట్ల నాగరాజు, బిజెపి సీనియర్ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్, వేగోళం శ్రీనివాస్ గౌడ్, ఎల్లంకి రాజన్న, ఎస్.ఎన్.సి వనజ, మెండ శంకరయ్య, అమ్ముల కుమార్, గజభింకర్ పవన్, మాటురి లత, పల్లె తిరుపతి, శేఖర్ మాస్టర్, ఎనగందుల సతీష్, బుర్ర సతీష్ గౌడ్, భూసారపు సంపత్, వల్స సాయికిరణ్, పోచంపల్లి ఈశ్వర్, కైరోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.