Wednesday, December 4, 2024
Homeతెలంగాణబిజెపి అసెంబ్లీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఇంటింటి ప్రచారం

బిజెపి అసెంబ్లీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఇంటింటి ప్రచారం

బిజెపి అసెంబ్లీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఇంటింటి ప్రచారం.

సుల్తానాబాద్,నవంబర్21(కలం శ్రీ న్యూస్): భారతీయ జనతా పార్టీ అభ్యర్థి  దుగ్యాల ప్రదీప్ కుమార్ ప్రచార కార్యక్రమంలో పాల్గొని కమలం గుర్తుకు ఓటు వేయాలని రైతులను మహిళలను అభ్యర్థించారు.గతంలో ఉన్న టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం అని,  గ్రామాలలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని,బిజేపి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు ఉచిత విద్యా,కార్పొరేట్ వైద్యం సామాన్య ప్రజలకు అందించడానికి కృషి చేస్తామని అన్నారు.బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాధికారం బిజెపి ముఖ్యమంత్రి పదవి బడుగు బలహీన వర్గాలైన బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చెప్పారని, రైతులకు వరి ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాలుకు 3100రూపాయలు ఇస్తామని హామీ ఇస్తున్నానని అన్నారు. మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు ఎన్నో సదుపాయాలు రాజ్యాంగపరమైన పదవులలో మహిళలను పురుషులతో సమానంగా చూస్తామని హామీ ఇస్తున్నాను.మూడు దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తున్న మాదిగల యొక్క ఎస్సీ వర్గీకరణ చేయడానికి కమిటీ వేస్తూ నరేంద్ర మోడీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అల్లిపూర్,రేగడిమద్దికుంట గ్రామాలకు కావలసిన అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను హామీ ఇస్తున్నాను.కావున దయచేసి మీరందరూ భారతీయ జనతా పార్టీ,బలపరిచిన అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ కుమార్ అనే నాకు కమలం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని సోదర,సోదరీమణులు, మహిళలు,కర్షకులు,విద్యార్థులు,యువకులు, అందరూ నాకు మద్దతుగా నిలుస్తారని 30 తారీఖున జరిగే పోలింగ్ లో కమలం గుర్తు పై ఓటేస్తారని అభ్యర్థిస్తూ మీకు అందరికీ శిరస్సు వంచి మరోసారి పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు యాదవ్,ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మీస అర్జున్ రావు, రేగడిమద్దికుంట ఎంపీటీసీ గడ్డం రాజమణి – మహిపాల్ రెడ్డి,మండల అధ్యక్షులు వేల్పుల రాజన్న పటేల్ సీనియర్ నాయకులు కడారి అశోక్ రావు,సౌదరి మహేందర్,అన్నమనేని రఘుపతి రావు,కొమ్ము తిరుపతి,శ్రీనివాస్ రావు,రాజేంద్ర ప్రసాద్, చాతరాజు రమేష్,తిరుపతి, మల్లిఖార్జున్,మండల ఇంచార్జ్ పొల్సాని సంపత్ రావు,బూత్ అధ్యక్షులు మారం రమేష్,శనిగరపు సదానందం,అశోక్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు,అభిమానులు,పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!