Saturday, July 27, 2024
Homeతెలంగాణసింగరేణి నిర్వాసితులకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌లోనే న్యాయం

సింగరేణి నిర్వాసితులకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌లోనే న్యాయం

సింగరేణి నిర్వాసితులకు బీఆర్‌ఎస్‌ సర్కార్‌లోనే న్యాయం

ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్21(కలం శ్రీ న్యూస్):ఎన్నికలు వస్తే ఆగమై ఆలోచన చేయకుండా ఓటు వేసి వృధా చేసుకోవద్దని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంథని మండలం అక్కెపల్లి, మల్లేపల్లి,సిరిపురం,బెస్తపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి ఐదేండ్ల కాలాన్ని వృధా చేసుకున్నామని మంథని ప్రజలు గ్రహించారని, ఏ గ్రామానికి వెళ్లినా సీఎం కేసీఆర్‌ పాలనను స్వాగతిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలుస్తామని చెబుతున్నారని అన్నారు. 2014లో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నాలుగేండ్లు ఎంతో అభివృధ్ది చేశానని, 2018లో కాంగ్రెస్‌కు ఓటు వేసి ఐదేండ్ల అభివృధ్దిని దూరం చేసుకున్నామని అన్నారు. ఆనాడుఎమ్మెల్యేగా సింగరేణి ప్రబావిత గ్రామాల్లోని నిర్వాసితుల సమస్యలు పరిష్కరించామని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలు,ఎక్స్‌గ్రేషియా లాంటివి ఇప్పించిన చరిత్ర తనదేనని అన్నారు. సింగరేణి సంస్థ కోసం భూములు ఇండ్లు త్యాగం చేసిన నిర్వాసితులను గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే న్యాయం జరిగిందన్నారు. అక్కెపల్లి గ్రామాన్ని ఇంకా సంస్థ స్వాధీనం చేసుకోలేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. నిర్వాసితుల పక్షాన నిలబడి సింగరేణి అధికారులతో పోరాటం చేశామని, అదే విధంగా అక్కెపల్లి నిర్వాసితుల కోసం అవసరమైతే పోరాటం చేస్తామని అన్నారు. సింగరేణి ఓసీపీల్లో ఈ ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అదే విధంగా సిరిపురం బ్యారేజీనీ టూరీజంగా తీర్చిదిద్ది ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుతామన్నారు. అంతేకాకుండా ప్రాజెక్టులో చేపలు పెంచి ఈ ప్రాంతంలోని ముదిరాజ్‌లు, రైతులు, మత్స్యకారులు పట్టుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. బ్యారేజీతో కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించేలా చూస్తామన్నారు. ఒకవైపు టూరిజంలా రూపుదిద్దుకుంటే సందర్శకుల తాకిడి పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే మత్య్స సంపద పెరిగితే ఆయా వర్గాలకు సైతం ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మన తరాలు బ్యారేజీ ప్రతిఫలాలు అనుభవిస్తారని ఆయన చెప్పారు. గత తొమ్మిదేండ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని, రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వం రాగానే మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 24గంటల కరెంటు, రైతు బీమా, రైతుబంధు,కళ్యాణలక్ష్మి, పించన్‌లు అందిస్తున్నామని, సీఎం కేసీఆర్‌ మూడోసారి కాగానే పించన్‌లు, రైతుబంధు పెంపు,రైతుబీమా తరహాలో కేసీఆర్‌ బీమా, సౌబాగ్యలక్ష్మి పేరిట ప్రతి గృహిణీకి ఇంటి అవసరాలకు రూ.3వేలు, రూ,400లకే గ్యాస్‌ సిలండర్‌ అందించనున్నట్లు ఆయన చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ పాలనలోనే అభివృధ్ది, సంక్షేమ ఫలాలు సాధ్యమవుతాయన్నారు. అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పాలకులు ఏనాడు ప్రజల అవసరాల గురించి ఆలోచన చేయలేదని, ఇంత గొప్ప పథకాలు అమలు చేయాలని చూడలేదన్నారు. ఈనాడు సీఎం కేసీఆర్‌ పథకాలు అమలు చేస్తుంటే మేం చేస్తామంటూ ఆరు అబద్దపు పథకాలతో మన ముందుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ పథకాలతో పాటు తాను సొంతంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. పేదింటి ఆడబిడ్డలకు పెండ్లి, హైదరాబాద్‌లో చదువుకునే పేదవిద్యార్ధులకు హస్టల్‌ వసతి కల్పించి పైసా ఖర్చు లేకుండా చదవిస్తానన్నారు. అలాగే గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు మంజూరీ చేయించి మూడు లక్షలతో పాటు తాను కొంత సాయం చేసి ఇంటినిర్మాణం చేయిస్తానని హమీ ఇచ్చారు. ఐదేండ్లు అవకాశం ఇస్తే ఏమీ చేయనోళ్లు మళ్లీ ఓట్ల కోసం మన వద్దనే వస్తున్నారని, వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. తనను ఆదరించి ఆశీర్వదిస్తే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, ఐదేండ్లు మీ సేవకుడిలా పనిచేస్తానని హమీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!