కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన సిపిఐ పార్టీ.
పెద్దపల్లి,నవంబర్19(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి పట్టణంలో అమర్ చంద్ కళ్యాణ మండపంలో సీపిఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ,విజ్జన్న గెలుపు కోసం పూర్తిగా మద్ధతు పలికిన పెద్దపల్లి సిపిఐ పార్టీ నాయకులు.
ఈ సందర్బంగా చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన చింతకుంట విజయరమణా రావు గెలుపు కోసం పెద్దపల్లి సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని విజయరమణా రావు గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళావేనా శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం,విద్యార్ధి నాయకులు బాలసాని లెనిన్,చంద్రగిరి ఉదయ్ పెర్క సతీష్,కోడెం స్వామి,యువజన నాయకులు ఆరెపల్లి మానస్ కుమార్,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.