Saturday, July 27, 2024
Homeతెలంగాణజగిత్యాలనిరు పేద పెళ్లికూతురికి అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పెళ్లిరోజు చిరు కానుక

నిరు పేద పెళ్లికూతురికి అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పెళ్లిరోజు చిరు కానుక

నిరు పేద పెళ్లికూతురికి అలయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పెళ్లిరోజు చిరు కానుక

ధర్మారం,నవంబర్18(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా,ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కొమ్ము లక్ష్మి, కీర్తిశేషులు బుచ్చయ్య మాకుర్తె మమత పెండ్లి కోసం అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం జోన్ చైర్మన్ తాళ్లపెల్లి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో వారి పెళ్లి రోజు సందర్భంగా చిరు కానుక డ్రెస్సింగ్ టేబుల్ అందజేశారు.పూర్తి వివరాలలోకి వెళితే కొమ్ము మమత తండ్రి బుచ్చయ్య చనిపోవడం వల్ల తల్లి కూలి నాలి చేసుకుంటూ బిడ్డను పోషిస్తూ జీవనం సాగిస్తున్నది. పెళ్లికూతురు మమత కూలి పని చేసుకుంటూ డిగ్రీ చదువుతుంది.ఇలాంటి పరిస్థితినీ చూసి  దాడి ఐలయ్య క్లబ్ దృష్టికి తీసుకురాగా స్పందించిన  సురేందర్ తన  పెళ్లిరోజు కానుకగా  కాబోయే పెళ్లికూతురు మమతకు చిరు కానుక డ్రెస్సింగ్ టేబుల్ అందజేశారు. అమ్మాయి తల్లి కొమ్ము లక్ష్మి సురేందర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ దాతలు ముందుకు వచ్చి మరింత సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 258 జోన్ చైర్మన్ తాళ్లపెల్లి సురేందర్ గౌడ్, క్లబ్ సెక్రటరీ మామిడి శెట్టి శ్రీనివాస్, పిఆర్వో బైరి చంద్రమౌళి, సభ్యులు కనగర్తి అరుణ్ కుమార్, కిషోర్ సేటు,దాడి ఐలయ్య కొమ్ము లక్ష్మి ,మమత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!