Tuesday, September 17, 2024
Homeతెలంగాణరాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30 శాతం నిధులు విద్యకు కేటయించాలి.

రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30 శాతం నిధులు విద్యకు కేటయించాలి.

రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30%శాతం నిధులు విద్యకు కేటయించాలి.

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్

పెద్దపల్లి,జనవరి28,(కలం శ్రీ న్యూస్):

రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30 శాతం నిధులు విద్యకు కేటయించాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ కి లక్ష్మి నారాయణ కి వినతి పత్రాన్ని అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి ప్రేమ్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% నిధులు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30% నిధులు ఇవ్వాలని కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తున్నాయని, కేంద్ర బడ్జెట్లో గత రెండు సంవత్సరాల నుంచి విద్యకు మూడు శాతం మించి నిధులు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టి ఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తుందని, 2014-15 బడ్జెట్లో 10.89 శాతం నిదులు కేటాయించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్  ఆ తర్వాత సంవత్సరాల నుంచి విద్యకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తున్నారని, గత రెండు సంవత్సరాల బడ్జెట్లో విద్యకు నిధులు ఆరు శాతం పెంచడం లేదని, బిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో దేశంలోని కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల్లో 25% పైగా నిధులు కేటాయిస్తున్న మన రాష్ట్రంలో ఇలా ఆరు శాతం కేటాయిస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల ఆదర్శంగా తీసుకోమని చెప్పడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 30% నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కల్వల శ్రీకాంత్(స్టాలిన్) ,జిల్లా సహాయ కార్యదర్శి కనుకుంట్ల సుమన్ పాల్గొన్నారు .

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!