Wednesday, May 22, 2024
Homeతెలంగాణబీఆర్‌ఎస్‌ పార్టీ మేనీఫేస్టో ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తుంది 

బీఆర్‌ఎస్‌ పార్టీ మేనీఫేస్టో ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తుంది 

బీఆర్‌ఎస్‌ పార్టీ మేనీఫేస్టో ప్రతి కుటుంబానికి భరోసా ఇస్తుంది 

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని,నవంబర్16(కలం శ్రీ న్యూస్):ఐదేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఏం చేయనోళ్లకు ఓట్లు వేసి అధికారం ఇస్తే ఏం చేస్తరని ఆలోచన చేయాలని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదూకర్‌ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం పాలకుర్తి మండలం జీడీ నగర్‌, బీసీ కాలనీ, కన్నాల, రణాపూర్ గ్రామాల్లో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో అబద్దాలు, అసత్యప్రచారాలు నమ్మిన ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారని, ఓట్లేసిన ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే మా ప్రభుత్వం లేదని దాటవేశాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఆలోచన చేయరని, అమాయకులని వాళ్లు బావించి ఏమీ చేయకున్నా మళ్లీ ఓట్లు వేస్తారని వస్తున్నారని ఆయన విమర్శించారు. ఐదేండ్లు అధికారం లో ఉండి ఒక్క పేదింటి ఆడబిడ్డి పెండ్లికి సాయం చేయనోళ్లు ఈనాడు ఓట్ల కోసం వందల కోట్లు ఖర్చు పెడుతూ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒకప్పుడు కన్నాల గ్రామ ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లని కాంగ్రెస్ కు ఓట్లు వేస్తలేరని కక్ష్యసాదించారని, గ్రామంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జినిర్మించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన గుర్తు చేశారు.ఈనాడు కనీసం ఆర్టీసీ బస్సు ఊరిలోకి రాకుండా చేశారన్నారు. కన్నాల గ్రామంలో ఒడ్డరి సామాజికవర్గం పెద్ద సంఖ్యలో ఉందని, ఒడ్డరి సామాజికవర్గం బీసీలనే విషయం చాలా మందికి తెలియదన్నారు. బీసీలంతా ఏకమైతే భవిష్యత్‌ ఉండదని భావించిన కాంగ్రెస్సోళ్లు భయపడి మనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు నియోజవకర్గంలో ఒక్క బీసీనాయకుడిని ఎదగనీయలేదని, రెడ్డి ,వెలమ సామాజికవర్గాన్ని సైతం అణిచివేశారన్నారు. తాను ఈస్థాయికి వస్తే రాజకీయంగా అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు.నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఎంతో అభివృధ్ది చేశానని, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని, అభివృధ్ది సేవలు మీకు కన్పిస్తూనే ఉన్నాయని అన్నారు.తొమ్మిదేండ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది చేశారని, అభివృధ్ది, సంక్షేమ పథకాలు ముందుకు సాగాలంటే మళ్లీ సీఎంగా కేసీఆర్‌ అధికారంలోకి రావాలన్నారు. సీఏం కేసీఆర్‌ పాలనలోనే ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు.

ఈనాడు ఓట్ల కోసం కాంగ్రెస్సోళ్లు గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు మాకు కేసీఆర్‌ అన్నం పెట్టిండని, మాకు పించన్‌ ఇస్తాండని, రైతు బంధు వస్తుందని డైరెక్ట్‌గా చెప్తున్నారని, మాకు కేసీఆర్‌ పాలనే కావాలని చెప్తున్న తీరును చూస్తే ప్రజల్లో కేసీఆర్‌ పాలనపై ఎంత నమ్మకం విశ్వాసం ఉందో అర్థం అవుతుందన్నారు. ఎవరు ఏం చేసిండ్లు, ఎవరు ఏం చేయలేదనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. తాను ఏనాడు ఓట్ల కోసం ఆరాటపడలేదని, ప్రజలతో తనకు పేగుబందం తప్ప ఓటు బందం లేదన్నారు.తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కన్నాలలో రోడ్డు వేయించానని, లారీ సమస్యలను తీర్చానని, క్రషర్‌ల కోసం ప్రయత్నం చేశానని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కన్నాలలో క్రషర్‌లను నడిపించే బాధ్యత కూడా తీసుకుంటానని అన్నారు. ఈనాడు ఒక బీసీ నాయకుడిగా ఎదుగాలంటే ఎంతో కష్టమని, అలాంటి పరిస్థితుల్లో అవకాశం వచ్చిన బీసీ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా చెప్పాడని ఆయన గుర్తు చేశారు.నాలుగేండ్లలో ప్రభుత్వసంక్షేమ ఫలాలను అందించడంతో పాటు తన తల్లిపేరున ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించామన్నారు. ఎన్నికలు వచ్చాయని ఆరు అబద్దాల పథకాలతో కాంగ్రెస్సోళ్లు మాయచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కర్ణాటకలో ఇదే తరహాలో మాయచేసి అదికారంలోకి వచ్చాక ప్రజలను ఆగం చేస్తున్నారని ఆయన వివరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనీఫెస్టో ప్రతి పేద కుటుంబానికి భరోసా ఇస్తుందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు, పించన్‌లు పెరుగుతాయని, కేసీఆర్‌ బీమా పేరుతో ప్రతి కుటుంబానికి భీమా వర్తిస్తుందని, సౌభాగ్యలక్ష్మి పేరున ప్రతి గృహిణీకి ఇంటి అవసరాలకు రూ.3వేలు అందించడం జరుగుతుందన్నారు.ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.ఈ పథకాలతో పాటు తాను సొంతంగా మరిన్ని సేవలు అందిస్తానన్నారు. ఆర్థికస్థోమత లేని పేదింటి ఆడబిడ్డలకు పెండ్లి చేస్తానని, హైదరాబాద్‌లో ఉండి ఉన్నత చదువులు చదువుకునే విద్యార్దులకుహస్టల్‌ వసతి కల్పించి పైసా ఖర్చు లేకుండా చదవించే బాద్యత తనదేన్నారు.అంతేకాకుండా గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు లేనివారికి ఇళ్లు మంజూరీ చేయించి మూడు లక్షలతో పాటు తాను కొంత సాయం చేసి దగ్గరుండి ఇంటి నిర్మాణం చేయించే బాధ్యత తనదేనని అన్నారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పే గుణం తనది కాదని, ఇచ్చిన మాటకుకట్టుబడి పని చేసే నైజమని ఆయన అన్నారు. మన భవిష్యత్‌ తరాల బాగుకు ఈ ఎన్నికలు ఉపయోగపడే విధంగా ఉండాలని, మనం వేసే ఓటు రేపటి తరాలకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. మీ ఇంటి బిడ్డగా ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు మీ సేవకుడిలా పని చేస్తానని, ఓటు వేసే ముందు గొప్పగా ఆలోచన చేయాలని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!