కమాన్ పూర్ లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్
మంథని,నవంబర్15(కలం శ్రీ న్యూస్):కమాన్ పూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రజక సంఘం నాయకులు జంగపెల్లి ఎల్లయ్య తో పాటు 20 మంది భీఆర్ఎస్ లో చేరిక.
బీఆర్‌ఎస్ పార్టీలో రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు స్వచ్చందంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. మంథని నియోజకవర్గంలోని తూర్పు మండలాలతో పాటు రామగిరి,కమాన్‌పూర్, మహాదేవపూర్, కాటారం,ముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారు. కమాన్ పూర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రజక సంఘం నాయకులు జంగపెల్లి ఎల్లయ్య తో పాటు 20 మంది బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృధ్దిని చూసి బీఆర్‌ఎస్‌లోకి రావడం జరిగిందని, అభివృధ్ది, సేవ చేసే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపు కోసం పనిచేస్తామని వారు ఈ సందర్బంగా తెలిపారు.