దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన శక్తిగా సహకార సంఘాలు
మంథని సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్
మంథని, నవంబర్ 14 (కలం శ్రీ న్యూస్):సహకార సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన శక్తిగా అవతరించాయని మంథని సహకార సంఘం కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ అన్నారు. సహకార వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మంథని సహకార సంఘం కార్యాలయ ఆవరణలో సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహకార సంఘాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కేంద్రం సహకార సంఘాల డిజిటలీకరణకు పెద్ద పీట వేస్తూ దేశంలోని అన్ని సహకార సంఘాలను ఒక తాటిపైకి తీసుకు వస్తుందని అన్నారు. మార్కెట్ ఆధారిత వ్యవస్థలలో ఒక సంస్థ వృత్తిపరమైన ప్రగతిశీల పథంలో సాగాలన్నా సభ్యుని యొక్క భాగస్వామ్యం,నిబద్ధత పెంపొందించడానికి నవీకరణ అత్యంత ఆవశ్యకమైన అంశమని, సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడిన నాటి నుంచి సహకార సంస్థల డిజిటలైజేషన్ ఆవశ్యకతను, ప్రాధాన్యతను తెలియజేస్తూ నవీకరణ, శ్రేణికొరకు సూచనలు చేస్తుందని,ఇందులో భాగంగా జాతీయ సహకార డేటాబేస్ నిర్మాణం,వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల కంప్యూటరీకరణ,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కామన్ సర్వీసు సెంటర్లుగా రూపొందిస్తూ చేసిన నిర్ణయాలు సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన ముఖ్యమైన పనులని అన్నారు. నెహ్రు జన్మదినం సందర్భంగా నవంబర్ 14 నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సహకార వారోత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ సిబ్బంది దుబ్బాక సదాశివ్, బెజ్జంకి సదానందం,బొద్దుల సమ్మయ్య,సంగినవేన నరేష్, పైడాకుల రాకేష్,గుడెళ్లి మధుమోహన్.నారమల్ల చిన్నయ్య, మోత్కూరి సాగర్, రాగం అశోక్, తదితరులు పాల్గొన్నారు.