ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తంగా నల్ల
పెద్దపల్లి,నవంబర్13(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి పట్టణం బండారికుంట కి చెందిన సార్ల భార్గవ కుమారుడు సార్ల కార్తీక్ (3) సంవత్సరాలు బ్లడ్ ఇన్ ఫెక్షన్ తో ప్రాణాపాయ స్థితిలో బాధపడుతూ హైదరాబాద్ లోని రెయిన్ బో ఆసుపత్రి లో అడ్మిట్ కాగా బిల్ 28 లక్షల 60 వేలు అవ్వగా వారు 9 లక్షల 60 వేలు చెల్లించగా,మిగతా 19 లక్షల రూపాయలు ఎన్.జి.ఓ ద్వారా ఇప్పించి ఆ కుమారునికి ప్రాణానికి అండగా నిలిచిన నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి.
ఈ సందర్బంగా వారు ప్రాణాపాయ స్థితి నుండి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా వారి ఇంటికి వెళ్లి కుమారిని బాగోగులు తెలుసుకొని కుటుంబసభ్యులను పరామర్శించి మనో దైర్యం అందించడం జరిగింది.