Saturday, July 27, 2024
Homeతెలంగాణఐపీఎస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

ఐపీఎస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

ఐపీఎస్ పాఠశాలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

సుల్తానాబాద్,నవంబర్ 10 (కలం శ్రీ న్యూస్): దీపావళి అనగా దీపముల వరుస అని అర్ధం అనగా మనుష్యులలోని అజ్ఞానపు చీకట్లను తొలగించుకొని సన్మార్గంవైపు నడవాలని, దీపపు వెలుగు తెలియజేస్తుందని, దీపావళి రోజున విద్యార్ధులందరూ ఒక దీపం వెలిగించాలని, ఆ దీపపు వెలుగు మానవత్వంతో సన్మార్గం వైపు దారి చూపే వెలుగు కావాలని ఐపీఎస్ పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ తెలిపారు. శుక్రవారం సుల్తానాబాద్ పట్టణం లో నీ ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జరిగిన ముందస్తు దీపావళి వేడుకలు చిన్నపిల్లల వేషధారణలతో,నృత్యాలతో పండగ వాతావరణం కనిపించేలా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీవాతీగా వస్తుందని తెలిపారు.దీపజ్యోతిని ప్రరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి,సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారని, ప్రజలను పీడించే నరకాసురిని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారని, కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారిందని తెలిపారు. అనంతరం విద్యార్ధులచే లక్ష్మి దేవి పూజ చేసి, దీపావళి పాటలకు నృత్యాలు చేసి, కాకరపువ్వొత్తులు,చిచ్చుబుడ్లు కాల్చి దీపావళి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. దీపావళి పండుగ విశిష్టతను విద్యార్ధులందరికీ తెలియజేసి సాంప్రదాయబద్దంగా ముందస్తు దీపావళి వేడుకలు జరుపటం ఎంతో సంతోషాన్నిస్తుందని పలువురు విద్యార్ధుల తల్లిదండ్రులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!