Wednesday, December 4, 2024
Homeతెలంగాణజగిత్యాలనిరుపేద బిడ్డ పెండ్లికి అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం 50 వేల సహాయం

నిరుపేద బిడ్డ పెండ్లికి అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం 50 వేల సహాయం

నిరుపేద బిడ్డ పెండ్లికి అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం 50 వేల సహాయం

జగిత్యాల,నవంబర్10(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన పొన్నం సత్తవ్వ మల్లేశం కుమార్తె రక్షిత పెండ్లి కోసం అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం జోన్ చైర్మన్ తాళ్లపెల్లి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో గౌరవ సభ్యులు సద్గురు ఎంటర్ ప్రైజెస్ ధర్మారం భూమా సంపత్, గూడెపు సతీష్ 50 వేల రూపాయల విలువ గల పెండ్లి సామాన్లు పర్పులు, బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, కూలర్,  మిత్రుల సహకారంతో 3 వేల రూపాయలు నగదు అందజేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి పొన్నం మల్లేశం కాలుకు గాయం వలన కాలు తీసివేయడం వల్ల ఏ పని చేయలేని పరిస్థితి. తల్లి పొన్నం సత్తవ్వ కూలి నాలి చేసుకుంటూ భర్తను, బిడ్డలను పోషిస్తూ జీవనం సాగిస్తున్నది. ఇలాంటి పరిస్థితికి చెందిన ఆడబిడ్డ రక్షిత పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేయలేని పెద్దరికాన్ని తెలుసుకొని పెద్ద మనసుతో ధర్మారం అలయన్స్ క్లబ్ ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. పలువురు గ్రామస్తులు చేసిన గొప్ప సహాయాన్ని గుర్తిస్తూ ప్రత్యేకంగా క్లబ్ సభ్యులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ తాళ్లపెల్లి సురేందర్ గౌడ్, సెక్రెటరీ మామిడిశెట్టి శ్రీనివాస్, పిఆర్వో బైరి చంద్రమౌళి, ఉపాధ్యక్షులు తోడేటి మురళి గౌడ్, కందుల సతీష్ ,గౌరవ సభ్యులు బొల్లం మల్లేశం, భూమ సంపత్ ,గూడపు సతీష్ , ఎండి సాదిక్, గుల్లకోట సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్,మిత్ర యూత్ ధర్మపురి సభ్యులు రాపర్తి సన్నీ,దోమకొండ శ్రీనివాస్, చిలివేరి కిరణ్, సంతోష్ , కొండపల్లి జితేందర్ రావు, కమలాపూర్ వాసులు, గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!