Thursday, September 19, 2024
Homeతెలంగాణజగిత్యాలమంత్రి హరీష్ రావు కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు

జగిత్యాల,నవంబర్ 09(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట నుంచి మరోసారి బరిలోకి దిగిన హరీశ్ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బయల్దేరారు. దారిలో హరీష్ రావు కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు.

అసెంబ్లీ ఎన్నికల నిబంధనల మేరకు మంత్రి హరీశ్ వాహనాన్ని పోలీసులు ఆపి విచారణ చేపట్టారు. హరీశ్‌రావు తన మద్దతుదారులు, బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి కారుతో పాటు ఆయన ప్రయాణిస్తున్న ఇతర వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేశారు.

ఎన్నికల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేశామని… అదే క్రమంలో మంత్రి కాన్వాయ్‌ని కూడా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. సహకరించిన మంత్రికి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తనిఖీ అనంతరం మంత్రి కాన్వాయ్‌ కొండగట్టు ఆలయం వైపు వెళ్లింది. కొండగట్టు ఆంజనేయస్వామి చెంతకు నామినేషన్‌ పత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

దర్శనానంతరం మంత్రి హరీశ్‌రావును ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి ఆశీస్సులతో సిద్దిపేటలో మళ్లీ బంపర్ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని…బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!