మహిళ సాధికారత బీజేపీ తోనే సాధ్యం
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 29 (కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని బీజేపీ పార్టీ ఆఫీస్ లో మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్,మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో సుమారు 40 మంది సిరిపురం గ్రామ మహిళలు చేరారు.అనంతరం సునీల్ అన్న మాట్లాడుతూ మహిళ సాధికారత బీజేపీ తోనే సాధ్యం, మహిళ శక్తి ప్రపంచనికి తెలిపే సమయం వచ్చింది ఆడవాళ్లు అంటే వంట ఇంటికి పరిమితం కాదని చట్ట సభలో 33% రిజర్వేషన్ ఇచ్చి అరుదైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారని అన్నారు.మంథనిలో బీజేపీ గెలుపులో మహిళలు ముఖ్య పాత్ర పోషించనున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్,పట్టణ ఇంచార్జ్ సబ్బాని సంతోష్,ముత్తారం మండల అధ్యక్షులు పెయ్యాల కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు అరె ఓదెలు, బీజేవైఎం మండలల అధ్యక్షులు చిట్టావేన హరీష్,కెక్కర్ల మహేష్,సీనియర్ నాయకులు బోసెల్లి శంకర్,ఎలవేణి సమ్మయ్య,పిట్టల రాయమల్లు, దేవునిరి కొమ్మురయ్య,యువ నాయకులు కురుమ శేఖర్, ముస్కుల అరుణ్ కుమార్ రెడ్డి, దాసరి శ్రీధర్ బాబు,పడాల తిరుపతి,ముల్కల నిఖిల్,పిట్టల రాయమల్లు,దేవునిరి కొమ్మురయ్య,సుంకరి రాకేష్,ఎర్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.