కారు దిగి కాంగ్రెస్ లోకి సతీష్ బాబు.
విజయ రమణారావు గెలిపే లక్ష్యంగా పనిచేస్తా.
ఎలిగేడు,అక్టోబర్29(కలం శ్రీ న్యూస్):బిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి పోతున్నట్లు బిఆర్ఎస్ నాయకులు ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు అన్నారు. ఆదివారం ఆయన ఎలిగేడు లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని, గత రెండు పర్యాయాలు దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కొరకు తన వంతు కృషి చేశానని, అయినా పార్టీలో గుర్తింపు లేదని, ముఖ్యంగా గత ఎన్నికల్లో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఎలిగేడు మండల వైస్ ఎంపీపీ బుర్ర వీర స్వామి గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు ఆయన తెలిపారు. విజయ రమణారావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకుంటా అని ఆయన అన్నారు.