తెలంగాణలో బీసీకి సీఎం పదవి ప్రకటించడం అభినందనీయం
పోతరవేని క్రాంతి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 28 (కలం శ్రీ న్యూస్):తెలంగాణ లో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు సముచిత స్థానం కల్పించే విధంగా అమిత్ షా తెలంగాణ లో నిన్న నిర్వహించిన సూర్యాపేట బహిరంగ సభలో బిసిలను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అభినందనీయం అన్నారు.ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని మరియు తెలంగాణను గమనించినట్లయితే బీసీ ముఖ్యమంత్రి పరిపాలన చేసిన సందర్భాలు చాలా అరుదు అలాంటిది ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అగ్రవర్ణాల పెత్తనం ఉన్న ఇటువంటి రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బహుజన కులాలకు సంబంధించిన వ్యక్తిని సీఎం చేయదలచి ఆ విషయాన్ని ఎన్నికల ముందుగా ప్రకటించడం భారతీయ జనతా పార్టీ ధైర్యానికి నిదర్శనం. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం బహుజన వాదులంతా భారతీయ జనతా పార్టీకి సహకారం అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని ఒక ప్రకటనలో క్రాంతి తెలిపారు.