Friday, September 20, 2024
Homeతెలంగాణఅమ్మా బతుకమ్మా...... పోయిరావమ్మా

అమ్మా బతుకమ్మా…… పోయిరావమ్మా

అమ్మా బతుకమ్మా…… పోయిరావమ్మా

ముగిసిన సద్దుల బతుకమ్మ సంబరాలు

తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి ఆడిపాడిన మహిళలు

సుల్తానాబాద్, అక్టోబర్ 22(కలం శ్రీ న్యూస్):బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సద్దుల బతుకమ్మ పండుగ ఆదివారం రోజున సుల్తానాబాద్ పట్టణం లో ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ సంబరాలతో, పూల జాతర సందడితో, సుల్తానాబాద్ వెలిగిపోయింది. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. బతుకమ్మలను అందంగా పేర్చి దేవుని ముందు ఉంచి పూజ చేసి సాయంత్రం మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మ లను ఎత్తుకొని ప్రధాన కూడళ్ల వద్ద, దేవాలయంలో వద్ద వందలాది మంది ఒకచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ ఆడి పాడారు. తమ పసుపు, కుంకుమలు కలకాలం పచ్చగా ఉండేలా చూడాలని గౌరమ్మను వేడుకున్నారు. ఆ తర్వాత ఊర చెరువు వద్దకు తీసుకొచ్చిన బతుకమ్మలను బతుకమ్మ బతుకమ్మ చల్లగా చూడమ్మా అంటూ వీడ్కోలు పలికారు. అనంతరం ముత్తయిదువలు తన వెంట తెచ్చుకున్న సత్తు పిండిని వాయనంగా ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ బతుకమ్మ వేడుకల నిమజ్జనం ప్రాంతంలో బతుకమ్మలను స్వాగతం పలికేందుకు మున్సిపల్ అధికారులు స్వాగత తోరణాలను ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంది.

Exif_JPEG_420

తీరుమారిన బతుకమ్మ ఆట పాట 

బతుకమ్మ ఆడుతున్న విధానం చూస్తే ఎందుకో మనసు చివుక్కుమంటున్నది..నగరం, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఎక్కడా కూడా సంప్రదాయమైన బతుకమ్మ పాట వినిపించడం లేదు..

సాంప్రదాయ బద్దంగా బతుకమ్మ ఆట, పాట తప్ప, ఆధునిక డాన్సులు చేయలేని మహిళలు కొత్త తరహా స్టెప్పులు వేస్తున్న మోడరన్ యువతులను చూస్తూ ఊరుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత వారి కళ్ళల్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది..ఈ పద్దతి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో మన ముందు తరాల పిల్లలు సంప్రదాయమైన బతుకమ్మ పాట లను ఇంటర్నెట్ వెతుక్కోవడం తప్ప మరో మార్గం లేదని పాత తరం మహిళలు అంటున్నారు.

 

అదిరిపోయిన ఏర్పాట్లు

సుల్తానాబాద్ మండలం లో ఆదివారం జరిగిన బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బతుకమ్మ పండుగ ఏర్పాట్లను మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునిత రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మల్లిఖార్జున్ గౌడ్, అధికారులు, సిబ్బంది, పాలకమండలి కలసి అదరగొట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ మరమ్మతులు చేయించారు. పట్టణ ప్రధాన కూడళ్ళలో జిగేల్ అనిపించేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ జగదీష్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!