మంథని నియోజకవర్గానికి చేరిన ఈవీఎం యంత్రాలు
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 22 (కలం శ్రీ న్యూస్): మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి జిల్లా కేంద్రం నుండి ఎన్నికలకు సరిపడా ఈవీఎం యంత్రాలు జేఎన్టీయూహెచ్ కాలేజీకి చేరుకున్నాయని మంథని ఆర్డిఓ హనుమ నాయక్ ఆదివారం తెలిపారు. వచ్చే ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈవీఎం భద్రత కోసం 24 గంటలు పోలీస్ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈవీఎం తరలింపు కార్యక్రమంలో మంథని తహసిల్దార్ రాజయ్య, కమాన్ పూర్, ముత్తారం, రామగిరి తహశీల్దార్ లతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల నియోజకవర్గ బాధ్యులు పాల్గొన్నారు.